Sunday, 6 July 2025

ఒక పిల్లఁగ్రోలువాఁడు


ప్రార్థన చేయగలగడం మానవజాతికి ఉన్న గొప్ప వరం. భగవంతుడి కోసం బుద్ధి తలుపులని తెరుచుకున్న మనిషి అహంకారాన్ని తగ్గించి, బాలుడిగా చేసి, ఆలోచనలనే ఎల్లలను తెంచి, ఆయుష్షుని పెంచే సంజీవని ప్రార్థన. ఈ వస్తువే కనుక ఉండి ఉండకపోతే, పెరిగే వయసుతో పెరిగే కుదింపుల స్వతంత్రత శిరసుమీద పెట్టే బరువుని మనిషి మోయడం అసాధ్యమయి ఉండేది. 

Friday, 4 July 2025

అలమేలుమంగాస్తవము


మాత్రాఛందస్సులలో అత్యంత ప్రసిద్ధి పొందినవి చతుర్మాత్రల  జాతి ఛందస్సులే అని చెప్పాలి. ఈ చతుర్మాత్ర గతి ఉన్న గీతాలు వినపడని రసపిపాసుల చెవులు ఎక్కడా  ఉండవు.  'చందన చర్చిత నీలకళేబర పీత వసన వనమాలీ' అని గీతగోవిందకారుడు దివ్యలోకాలలో ఉన్న కవితాకన్యని క్రిందకి దింపి నాట్యం చేయిస్తున్నపుడూ, వల్లభాచార్యుడు 'అధరం మధురం నయనం మధురం' అంటూ తీపి తేనెకే కాదు, కృష్ణవర్ణన చేసే గీతికీ ఉంటుందని నిరూపణ చేసినప్పుడూ, శంకరులు 'భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే' అని భవ్యబోధ సలిపినపుడూ ఈ నాలుగు చిటికెలంత పొడుగైన మాటలే వారికి ఊతమయ్యాయి.  

Saturday, 28 June 2025

జనార్దనాష్టకం


కందుకూరి రుద్రకవి పదహారవ శతాబ్దం నాటి వాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడని కొంతమంది అంటారు. సుగ్రీవవిజయమనే యక్షగానం, నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథాలను రచించాడు. కానీ ఈయనలోని మహాకవి బయటకి వచ్చింది యెనిమిది పద్యాల నిడివి ఉన్న ఒక కవితలో. 

Thursday, 26 June 2025

కాసిని కాళిదాసు చాటువులు


కశ్చిద్వాచం రచయితుమలం శ్రోతుమేవాపరస్తాం
కల్యాణీ తే మతిరుభయథా విస్మయం న స్తనోతి।
నహ్యేకస్మిన్నతిశయవతాం సన్నిపాతో గుణానాం
ఏకః సూతే కనకముపలస్తత్పరీక్షాక్షమోఽన్యః॥

Friday, 16 May 2025

తేలిక తాలూకు మహిమ


నాథే యాతే మధుపుర మతి
       క్షోభ విభ్రష్టచిత్తా
గోపీ కాచిత్కలయతి సఖీ
      రంతరంగాః సమీపే 
ప్రాణత్యాగాదతి గురుతరే 
      తస్యబంధోర్వియోగే
కేన స్థేయం ముహురిత వచో
       వ్యాకులా స్తా బభాషే. 

Sunday, 11 May 2025

వేమన గురువు చెప్పిన విముక్తివిద్య


 "తునాతున్క లగుచున్న 'కడిద'ము అను నల్లని రంగుపూత గల కాగితముపై పిండిబలపముతో వ్రాయబడియున్న యీ పద్యము లొక ప్రాచీన శతకములోనివి" అన్న గగుర్పాటు కలిగించే వాక్యంతో భారతి పత్రిక 1930 వ సంవత్సరం మార్చి సంచికలో "వటమూలమందిరా!" అన్న శీర్షికతో ఈ ఐదు పద్యాలు అచ్చయ్యాయి.

Tuesday, 6 May 2025

శైవశతకరత్నాలు

తెలుగు చాటుసాహిత్యంలోని శైవకవితలు నా మనసుని మహదానందంలో ముంచివేసాయి. శివభక్తి, శరణాగతి వంటి ఉత్తమగుణాలతో పాటు ప్రాకృతసాహిత్యంలో మాత్రమే దొరికే దగ్గరితనం, దేశీయత తెలుగులో శైవసాహిత్యంలో నాకు దొరికింది. 

Monday, 28 April 2025

పాఠకాభిగమనం


పుట్టపర్తి వారి జగద్విదితమైన కావ్యం “శివతాండవము” నకు వాగ్దేవి నా ద్వారా వ్రాయించుకున్న “సహాయవల్లి” వ్యాఖ్య నాకు ఎంతో ప్రత్యేకమైన రచన. దీనికి ముందుమాటలు గానూ, ఈ కృతి ఆవిష్కార సమయంలో స్పందనలు గానూ ఎందరో పెద్దలు, పండితులూ చల్లని పలుకులను ఈ రచనపై కురిపించారు. రచనను చదివి మరికొందరు తమ సహృదయస్పందనలను అందించారు. వారందరికీ ప్రత్యేకకృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇప్పటికి కలిగింది.

Thursday, 27 March 2025

మణిపూసలు: 5 - రంగనాథుని శివకవిత

రగడ శివకవుల సొత్తు. ఈ ఛందోరూపం తెలుగునేలపై శివకవుల చేతులలో పడి యెన్ని వయ్యారాలు పోవాలో అన్నీ పోయింది. ఈ ఛందస్సు పద్యకవితలలోని ఆవృత్తి ధర్మాన్నీ, జానపదాలలోని సంగీత ధర్మాన్నీ తనలో కలుపుకున్న అతి తక్కువ ఛందస్సులలో ఒకటి. దేశీయ ఛందస్సులకున్న ఈ లక్షణమే శివకవులని ఆకర్షించిందనుకుంటాను. రగడ, ద్విపద వంటి దేశీయ ఛందస్సులు కాస్త పాటల రూపం వైపు ఒగ్గినా, వీటి నిర్మాణానికి అనన్యసామాన్యమైన ధార కావాలి.